నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన దిలావర్పూర్ నిమ్మన్న (52) అనే రైతు విద్యుదాఘాతంతో మంగళవారం మృతిచెందాడు. ఊర చెరువు కింద వరిపంట సాగు చేస్తున్న కొందరు రైతులు అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు కొన్ని రోజుల నుంచి పంట చుట్టు విద్యుత్ తీగలను అమర్చుతున్నారు. ఉదయం పంట క్షేత్రానికి వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపేవారు.
మంగళవారం పొలంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారని అనుకున్న నిమ్మన్న అనే రైతు పాలంలోకి వెళ్లగానే విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని నిర్మల్ రూరల్ సీఐ వెంకటేష్, ఎస్సై వెంకటరమణలు తెలిపారు.