సామాజిక మాధ్యమాల్లో పోలీసుల పేరుతో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ... సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. వీరి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏకంగా పోలీసులనే లక్ష్యంగా చేసుకుని... వారి పేరిట నకిలీ ఖాతాలు తెరుస్తూ.. కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి ఖాతాల నుంచి వచ్చే సందేశాలకు ఎవరూ స్పందించకూడదని వివరించారు. తన ఫేస్బుక్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యక్ చేశారని యాదాద్రి భువనగిరి ఎస్సై రాజు తెలిపారు. తన ఫోటోతో కూడిన ప్రొఫైల్ పిక్చర్ తన ఫ్రెండ్స్ తో ఉన్న కవర్ పేజీతో కూడిన ఓ అకౌంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు క్రియేట్ చేశారని దీనికి ఎవరు రిక్వెస్ట్ పంపించవద్దని తోటి అధికారులకు మిత్రులకు తెలియజేశారు.
ఇదీ చూడండి: హేమంత్ హత్య కేసులో మలుపు.. తెరపైకి అవంతి సోదరుడు!