ETV Bharat / jagte-raho

బోగస్​ సంస్థల పేర్లతో కోట్లకు ఎసరు... ముగ్గురు అరెస్ట్​ - fraude companies invoices caught by cgst

బోగస్ సంస్థల పేర్లపై నకిలీ ఇన్ వాయిస్​లను సృష్టించిన ముగ్గురు నిందితులను సీజీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర్నుంచి రూ.19.1 కోట్లు రిఫండ్ తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. న్యాయస్థానంలో హాజరుపర్చగా.... 21 వరకు రిమాండ్ విధించినట్లు వివరించారు.

fake companies 3 accused arrest in rangareddy

author img

By

Published : Jan 7, 2021, 10:28 PM IST

బోగస్ సంస్థల పేర్లతో నకిలీ ఇన్ వాయిస్​లను సృష్టించిన ముగ్గురు నిందితులను రంగారెడ్డి సీజీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలతో మూడు బోగస్ సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు తీసుకున్నట్టు సీజీఎస్టీ కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి వెల్లడించారు. అనుమానంతో ఆ సంస్థలకు చెందిన ఇన్​వాయిస్​ బిల్లులను పరిశీలించగా.. బోగస్ సంస్థలుగా తేలినట్లు వివరించారు. రీఫండ్ కోసం దిల్లీ నుంచి రాహుల్ అగర్వాల్ వస్తున్నట్లుగా తెలుసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ మూడు సంస్థలు వ్యాపారం చేయకుండానే రూ. 32.54 కోట్లు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.19.1 కోట్లు రిఫండ్ తీసుకున్నట్లు వెల్లడించారు. బిహార్​కు చెందిన ముఖేశ్​ కుమార్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్​ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను నాంపల్లి ఆర్థిక వ్యవరాల న్యాయస్థానంలో హాజరుపర్చగా.... 21 వరకు రిమాండ్ విధించినట్లు వివరించారు. బోగస్ సంస్థల పని పట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నట్లు సీజీఎస్టీ కమిషనర్​ తెలిపారు.

ఇదీ చూడండి: కోడి మాంసం, గుడ్లు తినడం ఎంతవరకు సురక్షితం?!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.