ETV Bharat / jagte-raho

డాక్టర్ మానవత్వం​.. కరోనా మృతదేహం స్వయంగా తరలింపు

కరోనా వ్యాధితో ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. మృతదేహాన్ని తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా ఓ వైద్యుడు డ్రైవర్ అవతారమెత్తారు. స్వయంగా మున్సిపల్​ ట్రాక్టర్​ను నడిపించి.. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు.

Doctor humanity.. Corona patient dead body Moving to the cemetery
డాక్టర్ మానవత్వం​.. కరోనా మృతదేహం స్వయంగా తరలింపు
author img

By

Published : Jul 13, 2020, 11:53 AM IST

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఓ వైద్యుడు మానవత్వం చూపారు. కరోనాతో మృత్యువాతపడ్డ వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు మున్సిపల్​ సిబ్బంది ముందుకు రాకపోవడం వల్ల వైద్యుడే డ్రైవర్​గా మారారు. శ్మశానవాటికకు తరలించేందుకు మున్సిపాలిటీ ట్రాక్టర్​ను స్వయంగా నడిపించారు. వైద్యోనారాయణ హరి అని మరోసారి ఆచరణలో నిరూపించారు. ఈ సందర్భంగా సదరు వైద్యుడు శ్రీరామ్ సేవలను స్థానికులు కొనియాడారు.

మరోవైపు అంత్యక్రియల్లో పాల్గొనడానికి మృతుడి కుటుంబ సభ్యులకు వైద్యసిబ్బంది వెసులుబాటు కల్పించారు. ఇద్దరు కుమారులకు పీపీఈ కిట్లు ధరించి అంతిమయాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించి ఔదార్యం చాటుకున్నారు. కడచూపు కల్పించిన యంత్రాంగానికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీచూడండి: అత్యవసర మందుల కొరత.. ఇదే అదనుగా అడ్డగోలు ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.