బుల్లి తెర నటి శ్రావణి కేసులో ఎస్సార్ నగర్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రావణి స్నేహితుడు దేవరాజ్‌ను 8 గంటలుగా పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య జరిగిన నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలను దేవరాజ్ పోలీసులకు ఇచ్చినట్లు సమాచారం. శ్రావణి ఆత్మహత్యకు గల అసలు కారణలపై ఆరా తీస్తున్నారు.
నిర్మాత అశోక్ రెడ్డి తనను బెదిరించాడని దేవరాజ్ తెలిపినట్లు సమాచారం. ఇద్దరు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సప్ ఆడియోలను దేవరాజ్ పోలీసులకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయికృష్ణా రెడ్డిని విచారించే అవకాశముంది.
ఇదీ చూడండి: 'బుల్లితెర నటి ఆత్యహత్య కేసును క్షేత్రస్థాయిలో విచారిస్తాం'