ETV Bharat / jagte-raho

ఆ ఛాలెంజ్​లకు దూరంగా ఉండండి : సైబరాబాద్​ పోలీసులు

author img

By

Published : Sep 28, 2020, 10:49 PM IST

సామాజిక మాధ్యమాల్లో ప్రతిసారి ఏదో ఒక కొత్త ట్రెండ్, ఛాలెంజ్​లు రావడం సాధారణమే. ఎన్నో ఛాలెంజ్​లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం కపుల్ ఛాలెంజ్ ట్రెండ్​గా మారి.. సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఈ ఛాలెంజ్​లో భాగంగా సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా తమ భాగస్వామి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. కానీ ఆ సరదా అనేక సమస్యలను తెచ్చి పెడుతుందని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలు అంతర్జాలంలో పెట్టడం వల్ల ఆ ఫొటోలను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Cyber Police Warns About Couple Challenge
ఛాలెంజ్​లకు దూరంగా ఉండండి : సైబరాబాద్​ పోలీసులు

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అనేక రకాల కొత్త ఛాలెంజ్​లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫొటోలు అప్​లోడ్​ చేసే పోటీల విషయంలో చాలామంది ముందు వెనకా ఆలోచించకుండా అప్​లోడ్ చేస్తూనే ఉన్నారు. గతంలో పదేళ్ల ఛాలెంజ్​, శారీ ఛాలెంజ్ వంటి ఏవేవో... ఛాలెంజ్​లు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కపుల్​ ఛాలెంజ్​ వచ్చింది. ఈ ఛాలెంజ్​లో భాగస్వామితో దిగిన ఫొటోలను ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, ట్విట్టర్​లో పోస్ట్ చేస్తుంటే అవి చూసి.. సామాన్యులు కూడా.. పోటీ పడి మరీ.. ఉత్సాహంగా తమ సహచరితో దిగిన ఫొటోలను అప్​లోడ్ చేస్తున్నారు.

తీవ్ర ఇబ్బందులు ఉంటాయి

అయితే.. అప్​లోడ్​ చేసిన ఫొటోలు సైబర్ నేరగాళ్లకు చిక్కితే వ్యక్తిగత జీవితానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కపుల్ ఛాలెంజ్ పేరుతో అప్​లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని.. అప్​లోడ్ చేసే ముందు తమ వ్యక్తిగత ఖాతా భద్రత సెట్టింగ్స్​పై దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలను చాలామంది చూసి.. సులభంగా డౌన్​లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా డౌన్​లోడ్​ చేసిన ఫొటోల్లో యువతులు, మహిళల ఫొటోలు మార్ఫింగ్​ చేసి వేధించిన ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి.

దూరంగా ఉండండి..

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఏం చేసినా.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడం.. దానికి ఎవరు లైక్​ కొట్టారు.. ఎవరు కామెంట్​ చేశారు అని చూసుకోవడం అలవాటుగా మారింది. అయితే ప్రస్తుతం కపుల్ ఛాలెంజ్​లో భాగంగా మిగతా వారి కంటే ఎక్కువ లైకులు, కామెంట్లు రావాలని.. వివిధ రకరకాల భంగిమల్లో ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ ఫొటోలన్నీ సైబర్​ నేరగాళ్లు సులభంగా మార్ఫింగ్​ చేసే అవకాశాలున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత భద్రతను జాగ్రత్తగా దాచుకోవడంమే గాక.. తెలియని వారి ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు అంగీకరించవద్దని సూచిస్తున్నారు పోలీసులు. తెలియని వారిని ఫేస్​బుక్​ ఖాతాలోంచి తొలగించాలని.. ఛాలెంజ్​లకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్​ మోసగాళ్లతో భద్రం..

ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటి ద్వారా బ్లాక్​మెయిలింగ్​కు పాల్పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని పోలీసులు వివరించారు. మరికొందరు సైబర్ నేరగాళ్లు అశ్లీల వెబ్​సైట్లలో ఉన్న వీడియోకి ఈ ఫొటోలను ఆపాదిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కపుల్ ఛాలెంజ్ పై పుణే పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడు కపుల్​ ఛాలెంజ్​ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. భార్య, కూతురు, తల్లితో దిగిన ఫొటోలను ఛాలెంజ్ యాష్​ట్యాగ్​లతో సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఇప్పటి సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి సైబర్ నేరగాళ్ల ద్వారా బెదిరింపులు ఎదుర్కొన్న బాధితులు తమకు ఫిర్యాదులు ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఫన్ అండ్ ఫాలోయింగ్ కోసం వ్యక్తిగత ఫొటోలను అప్​లోడ్​ చేసి.. ఇబ్బందులు, సమస్యలు కొని తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీచూడండి: 'వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శిక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.