ETV Bharat / jagte-raho

ఓఎల్​ఎక్స్​లో యాడ్​ పెట్టారు.. డబ్బు పంపగానే మాయమయ్యారు - olx cheating in hyderabad

లాక్​డౌన్​ సమయంలో సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు వల వేస్తూ వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఓఎల్​ఎక్స్​లో యాడ్​ చూసి వివరాలు తెలుసుకోకుండా డబ్బు బదిలీ చేసి మోసపోయిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

cyber crime at asif nagar in hyderabad
హైదరాబాద్​లో సైబర్​ క్రైమ్
author img

By

Published : Apr 28, 2020, 3:38 PM IST

హైదరాబాద్​లోని ఆసిఫ్​నగర్​కు చెందిన సతీశ్​, బజార్​ఘాట్​కు చెందిన జమీల్​ అనే ఇద్దరు స్నేహితులు తక్కువ ధరకే టూవీలర్​ వాహనం వస్తుందని ఓఎల్​ఎక్స్​లో యాడ్​ చూశారు. ఆన్​లైన్​ సైట్​లో ఫొటో చూసి సదరు వ్యక్తికి తాము కొనుగోలు చేస్తామని సమాచారం ఇవ్వగా అతను ముందు డబ్బులు పంపమన్నాడు.

ముందూ వెనకా ఆలోచించకుండా సతీశ్​, జమీల్​లు లక్షా నాలుగు వేల రూపాయలను సదరు వ్యక్తి ఖాతాలో నగదు జమ చేశారు. రెండు మూడ్రోజులైనా వాహనం రాకపోవడం వల్ల బాధితులు సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.