పెళ్ళి పేరుతో ఇద్దరు మహిళలను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ముస్లిం సంఘం మ్యాట్రిమోని అనే వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ బషీర్బాగ్, మదన్న పేట్ ప్రాంతాలకు చెందిన ఇద్దరి మహిళల వివరాలు సేకరించారు. తాము విదేశాలలో డాక్టర్లమని నమ్మించి పర్సనల్ చాట్ చేస్తూ... పెళ్లి చేసుకుందామని నమ్మించారు.
పెళ్లి కోసం బహుమతులు, డబ్బులు పంపిస్తున్నామని మాయమాటలు చెప్పారు. మరో టీంతో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫోన్ చేస్తున్నామని విలువైన బహుమతులు, డబ్బులు వచ్చాయని చెప్పించేవారు. వాటికి కస్టమ్స్, ఐటి ఇతర చార్జీలు అవుతాయని చెప్పి, ఇద్దరి నుంచి 1.70 లక్షల రూపాయలు కాజేశారు. బహుమతులు, డబ్బులు రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న వారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్ ముందుగా అందేదెవరికి?