యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్‌లో కొందరు పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో భువనగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. వారి నుంచి రూ.12,910 నగదు, ఐదు చరవాణీలు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పట్టణ పోలీసులకు అప్పగించారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశామని భువనగిరి పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా వేళ... ఊరెళ్లేటోళ్లకు ఊరట!