ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించిన ఓ సెక్యూరిటీ గార్డ్‌కు హైదరాబాద్ నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్టు కఠిన శిక్ష విధించింది. అబిడ్స్ చాపెల్ రోడ్లో సుజాత స్కూల్లో ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన కమల్ భాన్ (33) సెక్యూరిటీ గార్డ్‌గా పని చేసేవాడు.
2017లో అదే స్కూల్లో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని ... నిందితుడి కమల్ భాన్‌ను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణ ముగియటంతో... నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్టు తీర్పును వెల్లడించింది. దోషిగా తేలిన కమల్ భాన్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది.
ఇదీ చదవండి: అపహరణకు గురైన మూడు నెలల చిన్నారి... కథ సుఖాంతం