హైదరాబాద్ మలక్ పేటలోని ఓ అకాడమీ సంస్థ నకిలీ ధృవపత్రాలు ఇచ్చి మోసం చేసిందని కొందరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముసారాంబాగ్ లోని ఫర్చ్యూన్ ఫయర్స్ ఏవియోషన్ అకాడమీ అనే సంస్థ యాజమాన్యం… ఒక్కొక్కరి దగ్గర రూ. 80 వేల చొప్పున 250 మంది విద్యార్థుల నుంచి వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
జాబ్ ఇప్పిస్తామంటూ 6 నెలల పాటు శిక్షణ ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. అనంతరం ఐఎఫ్, ఐఏఓ స్టాంప్ తో నకిలీ సర్టిఫికెట్ ఇచ్చారని పోలీసులకు వివరించారు. తీరా ఉద్యోగం కోసం కంపెనీల వద్దకు వెళితే సదరు అకాడమికి రిజిస్ట్రేషన్ లేదంటూ వెనక్కి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
అకాడమీ వద్దకు వెళితే అక్కడ టూ-లెట్ బోర్డ్ కనిపించిందని తెలిపారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని, విచారణ చేసిన తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని సీఐ తెలిపారు.
ఉద్యోగాల పేరుతో.. ఒక్కొక్కరి నుంచి రూ. 80 వేలు వసూలు - నకిలీ ద్రువపత్రాలతో మోసం
జాబ్ ఇప్పిస్తామంటూ 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి... నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చినట్టు హైదరాబాద్ మలక్ పేటలోని ఫర్చ్యూన్ ఫయర్స్ ఏవియోషన్ అకాడమీపై విద్యార్థులు ఫిర్యాదు చేశారు.