ETV Bharat / jagte-raho

అధిక వడ్డీల పేరుతో రూ. 2 కోట్లు మోసం.. ముగ్గురు అరెస్ట్​

author img

By

Published : Nov 6, 2020, 11:50 AM IST

అధిక వడ్డీలు ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తోన్న ముగ్గురిని హైదరాబాద్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. అబిడ్స్​లోని ఓ అపార్ట్​మెంట్​లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఈ మోసం బయటపడింది. సుమారు రూ. 2 కోట్ల వరకు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

cheating via highest interests in hyderabad
అధిక వడ్డీల పేరుతో రూ. 2 కోట్లు మోసం.. ముగ్గురు అరెస్ట్​

గొలుసు కట్టు విధానం ముసుగులో అధిక వడ్డీలు ఇస్తామంటూ మోసానికి పాల్పడిన ముగ్గురిని హైదరాబాద్​ పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబిడ్స్​లోని ఓ అపార్ట్​మెంట్​లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఈ మోసం బయటపడింది.

అధిక వడ్డీలు ఇస్తామంటూ హద్మన్​లాల్ కుమావత్ అనే వ్యక్తి , మరో ఇద్దరు కలిసి 'హైపర్ నెక్స్ట్​' అనే కంపెనీని ప్రారంభించాడు. ఆన్​లైన్​లో కార్యాలయ వ్యవహారాలని నడిపించాడు. సులభంగా డబ్బు గడించాలనే ఆశతో ప్రజలకు మాయ మాటలు చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల వరకు వసూలు చేశారు. మొదట్లో వడ్డీలు ఇచ్చి, స్టార్​ హోటళ్లలో సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కస్టమర్ల ఫోన్​ కాల్స్​కు స్పందించకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దాడులు నిర్వహిచారు.

ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మూడు చరవాణులు, ల్యాప్​టాప్, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: గంగుల శ్రీనివాస్​ మరణం ఎంతగానో బాధిస్తోంది: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.