ETV Bharat / jagte-raho

చైన్ స్నాచర్​ కోసం సినీ ఫక్కీలో చేజింగ్​... ఆ తర్వాత? - నాగర్ కర్నూల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ వార్తలు

సినిమాను తలపించేలా ఓ చైన్ స్నాచర్ కోసం... ఇద్దరు యువకులు వెంబడించారు. బైక్​తో దొంగ బైక్​ను ఢీకొట్టారు. చైన్​ స్నాచర్ స్వెట్టర్ పట్టకుని లాగారు. ఇక చివరకు ఆ దొంగ స్వెట్టర్​ను, చైన్​ను, బైక్​ను వదిలి పరారయ్యాడు. ఈ ఘటన నాగర్​ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

chain snatch
చైన్ స్నాచర్​ కోసం సినీ ఫక్కీలో చేజింగ్​... ఆ తర్వాత?
author img

By

Published : Dec 21, 2020, 4:10 PM IST

Updated : Dec 21, 2020, 8:55 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కేంద్రంలో ఓ మహిళా మెడలో నుంచి దొంగ.. చైన్​ స్నాచింగ్​ చేసి పారిపోతుండగా... ఇద్దరు యువకులు సినీ ఫక్కీలో ఆ దొంగను వెంబడించారు. ఆ దుండగుడు చైన్​, బైక్​ను వదిలి పారిపోయాడు.

చైన్ స్నాచర్​ కోసం సినీ ఫక్కీలో చేజింగ్​... ఆ తర్వాత?

అసలేం జరిగిందంటే...

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్​ సంఘమేశ్వర బ్యాంక్​ ముందు నుంచి మున్సిపాలిటీకి వెళ్లేదారిలో మానస అనే మహిళ వెళ్తుంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తి ఆమె మెడలోంచి 4 తులాల మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లాడు. దీనితో ఆమె అరిచింది. అక్కడే ఉన్న యువకులు ఆ బైకర్​ను సినీ ఫక్కీలో వెంబడించారు. దొంగ బైక్​ను వీరి బైక్​తో వేగంగా ఢీకొట్టారు. ఈ తరుణంలో దొంగను పట్టుకునే ప్రయత్నంలో అతను వేసుకున్న స్వెట్టర్​ను పట్టుకోగా... చైన్​, బైక్​, అతని జాకెట్​ను వదిలేసి దొంగ తప్పించుకుని పరారయ్యాడు.

దొంగను పట్టుకున్న యువకులు... సీసీటీవీ వీడియో

అతను వదిలి వెళ్లిన బైక్​ ప్యాషన్​ ప్రో వాహనం కాగా.. దానికి నంబర్​ ప్లేట్​ కూడా లేదు. బైక్​ కవర్​లో ఓ ఇనుప చైన్​ ఉంది. సీసీ కెమెరాలు పరిశీలించి... ఆ దొంగను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన యువకుల చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. దొంగను చాకచక్యంగా పట్టుకోవడానికి ప్రయత్నించిన యువకులను స్థానికులు ప్రశంసించారు.

ఇదీ చూడండి:వార్షిక క్రైం నివేదిక విడుదల.. 10శాతం తగ్గిన నేరాలు

Last Updated : Dec 21, 2020, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.