కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోరీ జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు.
జమ్మికుంటకు చెందిన గోలి శారద సొంత పనుల నిమిత్తం బయటకు వెళ్లింది. తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా.. బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. అప్రమత్తమైన శారద.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
సమాచారం అందుకున్న పోలీసులు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటుగా వెళ్లారనే కోణంలో సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సృజన్‌రెడ్డి వెల్లడించారు.