భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లందు నుంచి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. గోదావరిఖని వైపు వెళ్తున్న బస్సును ఇల్లందు వైపు వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇల్లందు మండలం ముకుందపురానికి చెందిన దుర్గారావు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: పాతబస్తీలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు