ఏపీ గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణ మఠం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ముగ్గురు వ్యక్తులు కారులో నిజాంపట్నంలో పెళ్లి వేడుకకు వచ్చి తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
స్థానికులు వారిలో ఒకరిని కాపాడారు. మరో ఇద్దరు ఊపిరాడక మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్ని కర్లపాలెం మండలానికి చెందిన సాంబశివరావు, రాజేంద్రగా గుర్తించారు. మృతదేహాలను రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి