హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి చెందారు. దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారు.. దోమలపెంట సమీపంలో మలుపు వద్ద అతివేగంగా వచ్చి బోల్తా కొట్టింది. కారులో ఐదుగురు ఉన్నారు. కారు నడుపుతున్న చంద్రశేఖర్.. పక్కనే ముందు సీటులో ఉన్న తల్లి సరస్వతి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మిగిలిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: శబ్ద కాలుష్యంపై పోలీసుల ఆగ్రహం... వాహనాలు సీజ్