విద్యుత్ బిల్లు వసులు కోసం వెళ్లిన అధికారులపై, అధిక బిల్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విద్యుత్ బిల్లులు వసూలు కోసం వెళ్లిన లైన్మన్, విద్యుత్ సహాయకులపై మామిడి సంపత్ రెడ్డి అనే వ్యక్తి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో ఒకరి తల పగలగా, మరొకరి చేయి విరిగింది. గాయాలపాలైన సిబ్బందిని కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: కరెంట్ కట్ చేయబోతే.. కొడవలితో బెదిరింపు