సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాములలో మూడు రోజుల క్రితం బిక్కేరు వాగులో గల్లంతైన బాలుడు శవమై తేలాడు. ఈనెల 21 మధ్నాహ్నాం గ్రామానికి చెందిన కొర్నె వరుణ్ (11) బిక్కేరు వాగులో తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.
మూడు రోజులుగా గ్రామస్థులు, అధికారులు వెతికినా బాలుడి ఆచూకి దొరకలేదు. శుక్రవారం సాయంత్రం గ్రామం సమీపంలో మోటరు బిగించేందుకు వెళ్లిన రైతుకు దుర్వాసన రావటం వల్ల పరిశీలించగా బాలుడి శవం కన్పించింది. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా... వచ్చి చెట్ల కొమ్మల మధ్య చిక్కుకున్న బాలుడి శవాన్ని బయటకు తీశారు. విగతజీవిగా బాలుడి శవం కన్పించడం వల్ల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బాలుని తండ్రి కొర్నె ప్రవీణ్... గ్రామ ఎంపీటీసీగా ఉన్నారు.