రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. నిరుద్యోగ భృతి అమలు చేయడంతో పాటు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలంటూ దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని బీజేవైఎం కార్యకర్తలు నినాదాలు చేశారు. ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: 'దివ్యాంగుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి'