రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సత్రాజుపల్లె శివారులో ఆరుగురు ప్రయాణికులతో వేములవాడ వైపు వెళ్తున్నఆటోను వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయానికి దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మంచిర్యాల జిల్లా భీమారం మండలం దామాపూర్ గ్రామానికి చెందిన పుప్పాల భాస్కర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన ఇద్దరిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న వేములవాడ పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: బాలిక ఆత్మహత్యాయత్నం.. కాపాడేందుకు యత్నించిన పోలీసులు.. కానీ