ETV Bharat / jagte-raho

మత్తు మందిచ్చి కిడ్నాప్​కు యత్నం.. తప్పించుకున్న బాలుడు

author img

By

Published : Dec 8, 2020, 10:39 PM IST

మత్తు మందు ఇచ్చి బాలుడిని అపహరించేందుకు ఇద్దరు వ్యక్తులు విఫలయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్​ మండలం ఎర్రపహాడ్​ వద్ద జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. కిరాణం షాపుకు వెళ్తుండగా ద్విచక్రవాహనంపై ఎత్తుకెళ్లేందుకు దుండగులు యత్నించారు.

Attempt to kidnap for boy in suryapeta dist
మత్తు మందిచ్చి కిడ్నాప్​కు యత్నం...తప్పించుకున్న బాలుడు

కిరాణం షాపుకు వెళ్తున్న బాలుడిని అపహరించేందుకు ఓ ముఠా విఫలయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్​ మండలం ఎర్రపహాడ్​ వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన తుమ్మలపల్లి శ్రీదేవి కుమారుడు శివకుమార్​(11)తో కలిసి తన అక్క కూతురు వివాహానికి వచ్చింది.

బాలుడు కిరాణ దుకాణానికి వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. వెంటనే మరో బైక్​పై వచ్చిన వ్యక్తులు బాలున్ని మధ్యలో కూర్చోబెట్టుకుని మరిపెడ వైపు వెళ్తుండగా దిర్మన్​పల్లి సమీపంలో భారత్​ బంద్ నిరసనకారుల​ శబ్దాలకు శివకుమార్​కు మెలకువ వచ్చింది. తేరుకున్న బాలుడు గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అదే దారిలో వస్తున్న అతని పెద్దమ్మ కుమారుడు గమనించి సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు లేకపోవడంతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జాతీయ రహదారి అడ్డాగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.