తమకు అనుకూలంగా వార్త రాయలేదని... తన ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేసినట్లు ఏపీలోని చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన ఓ విలేకరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరి సొంతూరు కందూరులో యువకులు వీరంగం సృష్టించారు. ఇంట్లో ఉండే సామాన్లు బయటకు వేసి ధ్వంసం చేశారు.
అనుకూలంగా వార్త రాయలేదని అక్కసుతో ఇంటిపై దాడిచేసి, చంపేస్తామని బెదిరించారని విలేకరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకులు దాడి చేస్తున్న సమయంలో దృశ్యాలను రికార్డ్ చేసిన విలేకరి... వాటి ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: పాలబుగ్గల పసివాడు... ఆరుష్ రెడ్డి ఎక్కడున్నాడో!