ETV Bharat / jagte-raho

పెట్రో మోసం... లీటరుకు 30 మి.లీ. తక్కువ పోసేస్తున్నారు! - తూనికల కొలతల శాఖ దాడులు

ఏపీలోని పెట్రోల్​ బంకులపై తూనికల కొలతల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా 25 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. లీటర్‌కు 30 నుంచి 40 మిల్లీ లీటర్ల తక్కువ పెట్రోల్‌ను వినియోగదారునికి పోస్తున్న విషయాన్ని గుర్తించామని అధికారులు వెల్లడించారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

లీటరుకు 30 మి.లీ తక్కువ పోసేస్తున్నారు
లీటరుకు 30 మి.లీ తక్కువ పోసేస్తున్నారు
author img

By

Published : Sep 6, 2020, 12:20 PM IST

పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న అవకతవకలపై తూనికలు కొలతలశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీలో రెండో రోజు 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. చిప్‌ ఉపయోగించి... లీటర్‌కు 30 నుంచి 40 మిల్లీ లీటర్ల తక్కువ పెట్రోల్‌ను వినియోగదారునికి పోస్తున్న విషయాన్ని గుర్తించామని తూనికలు కొలతలశాఖ ఐజీ కాంతారావు తెలిపారు. పలు జిల్లాల్లో ఈ విధంగా మోసం చేస్తున్న విషయం వెల్లడైందన్నారు. మరిన్ని చోట్ల దాడులు చేసి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • చిప్​ల ద్వారా పెట్రోలుపై లీటర్​కు రూ.2.60పైనే కొల్లగొడుతున్నారు. సగటున రోజుకు 5వేల లీటర్ల పెట్రోలు అమ్మకం జరిగే బంకుల్లో రూ. 13వేలకు పైగానే అక్రమాలకు పాల్పడుతున్నారు.
  • రోజుకు 13వేల లీటర్ల డీజిల్ అమ్మకం జరిగే బంకులో రూ. 36వేల వరకు దోచుకుంటున్నారు. మొత్తంగా ఒక్కో బంకులో రోజుకు దాదాపుగా రూ.50వేలకు వరకు దోపిడీ సాగిస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇవీచూడండి: సచివాలయంలో కూల్చిన మసీద్​కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.