మేడ్చల్ జిల్లా రామాంతపూర్‌లో బాలుడి కిడ్నాప్‌కు యత్నించిన యువకుడు.. అనంతరం ఆ చిన్నారిని సమీపంలో వదిలేసి వెళ్లాడు. నెహ్రూనగర్‌లోని శ్రీనివాస మిల్క్ పార్లర్‌లో ఒంటరిగా ఉన్న రుత్విక్ యాదవ్(8) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి మభ్యపెట్టాడు. దుకాణంలో ఉన్న రూ. 5వేల నగదు దొంగిలించడంతో పాటు బాలుడిని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు.
బాలుడు కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించి.. పరిసర ప్రాంతాల్లో వెతికారు. గంట తరువాత తిరిగి తల్లితండ్రుల దగ్గరకు చేరుకున్న బాలుడు జరిగిన విషయం చెప్పాడు. కిడ్నాపర్ తనను శారదానగర్‌లోని శ్రీ చైతన్య కళాశాల వద్ద విడిచిపెట్టి అక్కడే ఉండమని చెప్పి వెళ్లినట్లు తెలిపాడు. ఈ సంఘటనపై పలు సందేహాలు వ్యక్తం కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: స్పీడ్ పోస్టులు పంపి ఖాతాలు కొల్లగొట్టేస్తారు.. జాగ్రత్త.!