యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం వెంకీర్యాల గ్రామ సమీపాన మూసీనది పక్కన గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు మూసీ నది వరదల్లో కొట్టుకు వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు.
పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవం ఉండటం వల్ల... పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్రామ సర్పంచ్ ఫిర్యాదు మేరకు బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ