ఇసుక లారీ ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగింది. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు చెందిన బడే సాబ్ (70)... మండల కేంద్రంలోని దర్గా వద్ద రోడ్డు దాటుతుండగా... వరంగల్ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో కొంత దూరం ఈడ్చుకుని వెళ్లిపోయింది. బడేసాబ్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: దారుణ హత్య: హత్య చేసి, ముఖంపై పెట్రోల్ పోసి!