భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బుట్టాయిగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన సమీప ప్రాంతవాసులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహిళ మృతదేహాన్ని పరిశీలించారు.
ఆమె ముఖం కాలిపోయి గుర్తుపట్టలేకుండా ఉండటం పల్ల క్లూస్ టీం సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతిని హత్య చేసి ఇక్కడ కాల్చి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఎవరు అనే విషయం ఇంకా నిర్ధరణ కాలేదని తెలిపారు.
ఇదీ చూడండి: ఇదీ చూడండి:'150కిపైగా దేశాలకు కరోనా ఔషధాలు అందిస్తున్నాం'