ఏపీలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలో వేగంగా వస్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెడ్డవడుగూరు మండలం మిడుతురు గ్రామానికి చెందిన... యువతేజ అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా... ఆమె తండ్రి గాయాలపాలయ్యారు. కుమార్తె మరణంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఆడపిల్లకు జన్మనిచ్చిందని భార్యపై భర్త హత్యాయత్నం