ETV Bharat / jagte-raho

దారుణం: కన్నతల్లిని కర్రతో కొట్టి చంపిన కొడుకు - వరంగల్​ రూరల్​ జిల్లా నేర వార్తలు

వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం శివాజీ నగర్​లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కన్నతల్లిని కుమారుడు కర్రతో కొట్టి హత్య చేశాడు.

son murdered his mother with beat family quarrels
కుటుంబ కలహాలతో తల్లిని కర్రతో కొట్టి చంపిన కుమారుడు
author img

By

Published : Jul 13, 2020, 5:47 PM IST

కుటుంబ కలహాలతో ఓ కుమారుడు తన తల్లిని కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం శివాజీ నగర్​లో జరిగింది. గ్రామానికి చెందిన రాజేందర్​... తన తల్లి కమలాబాయితో గొడవ పడ్డాడు. కోపంలో ఆమె తలపై కర్రతో బలంగా కొట్టాడు.

తలపై తీవ్ర గాయం కావడం వల్ల ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని చూసి రాజేందర్​ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు డాగ్​స్వ్కాడ్​తో తనిఖీలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.