ETV Bharat / jagte-raho

పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్యాయత్నం - yuvakudu aaatma hatyaa prayathnam

చేయని నేరాన్ని తమపై ఆపాదించి, పోలీసులు తీవ్రంగా కొట్టారని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసుల తీరును నిరసిస్తూ పినపాక డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు రాంబాబు కుటుంబీకులు.

డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగిన రాంబాబు కుటుంబీకులు
author img

By

Published : May 3, 2019, 7:13 PM IST

Updated : May 4, 2019, 7:01 AM IST

పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్​లో ఈ నెల ఒకటిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. అదే గ్రామానికి చెందిన మర్రి రాంబాబే చోరికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మర్రి రాంబాబును పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. మనస్తాపానికి గురైన రాంబాబు శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడ్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ డీఎస్పీ కార్యాలయం ఎదుట రాంబాబు కుటుంబీకులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకి దిగిన రాంబాబు కుటుంబీకులు

ఇవీ చూడండి: డ్రైవర్​ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Intro:పోలీసులు తీవ్రంగా కొట్టడంతో యువకుడు ఆత్మహత్య ప్రయత్నం

Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం
మణుగూరు తులసి తీవ్రంగా కొట్టడంతో మనస్థాపానికి గురై మరి రాంబాబు యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన శుక్రవారం మనుగురులో చోటు చేసుకుంది. మణుగూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో ఈ నెల 1న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది .ఈ దొంగతనం అదే గ్రామానికి చెందిన మర్రి రాంబాబు అనే యువకుడు చేశాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు పోలీస్ స్థానాల్లో ఫిర్యాదు. చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మర్రి రాంబాబును పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు .దీంతో మనస్తాపానికి గురైన రాంబాబు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాదు.వెంటనే అతన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.

Conclusion:ధనబలంతో ఎటువంటి విచారణ చేపట్టకుండా నేరం రుజువు కాకుండానే మరి రాంబాబు ను తీవ్రంగా కొట్టడమేమిటని బాధిత కుటుంబీకులు గ్రామస్తులు శుక్రవారం ఉదయం డి ఎస్ పి ఆర్ సాయిబాబా కలిసేందుకు వచ్చారు. డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు వెనుదిరిగి వెళ్లారు.. దొంగతనం జరిగిందని చెప్పిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించాలని, దొంగతనం చేసినట్లు ఆరోపణలు చేయడం వల్ల రాంబాబు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని వెంటనే తగు న్యాయం చేయాలని రాంబాబు కుటుంబీకులు గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Last Updated : May 4, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.