జీవితంపై విరక్తిచెంది ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చోటుచేసుకుంది. బానోతు అరుణ్ కుమార్ (30) సెంటినరీ కాలనీలో నివాసం ఉంటూ.. జనరల్ మజ్దూర్గా ఏయల్పీ మైన్లో విధులు నిర్వహిస్తున్నాడు. 2017లో కృష్ణవేణితో వివాహం జరిగింది.
కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత ఎప్రిల్ నెలలో భార్య తన పుట్టింటికి వెళ్లి పోయింది. అప్పటి నుంచి అరుణ్ తనలో తాను బాధపడుతూ జీవితం మీద విరక్తి చెందాడు. గోద్రెజ్ హెయిర్ డై తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక సింగరేణి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి తల్లి సాల్కు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
ఇదీ చదవండి: 'నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి': అలీ బగ్దాదీ