కరీంనగర్ గ్రామీణ మండలం నగునూరు గ్రామంలో నీటి కుళాయి వద్ద జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందారు. నల్లా పైపు తొలగింపు విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తలెత్తింది. పైపు ఎందుకు తీశావని మృతుడు అమిరిశెట్టి రాములుతో అమీర్ అనే వ్యక్తి గొడవ పడినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ క్రమంలో అమీర్‌తో పాటు పది మంది కలిసి తన తండ్రిని తీవ్రంగా కొట్టారని మృతుని కూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి వీధి కుక్కల దాడి... 40 మేకలు మృతి