వనపర్తి జిల్లా మదనాపురం మండలం స్కూల్తండాకు చెందిన శివ(25), పార్వతి(30)... వరుసకు అత్త, అల్లుడు అవుతారు. దుప్పల్లి సమీపంలో కొన్నూర్కు వెళ్లేదారిలో ఇద్దరు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వాళ్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న ఇద్దరిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు