భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సంజయ్‌నగర్‌కు చెందిన కేశినేని లక్ష్మణ్ తన భార్య లావణ్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన లక్ష్మణ్.. ఆత్మహత్య చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. మెడకు తాడు బిగించుకుని భార్యకు సెల్ఫీ ఫొటో పంపించాడు. కంగారు పడిన భార్య లావణ్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా లక్ష్మణ్‌ను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ వేణుచందర్ తెలిపారు.