ETV Bharat / jagte-raho

బంగారం పట్టివేత కేసులో విచారణ ముమ్మరం - రంగారెడ్డి జిల్లా వార్తలు

శంషాబాద్‌ ఎయిర్‌ కార్గోలో బంగారం పట్టివేత కేసులో కస్టమ్స్‌ అధికారులు పురోగతి సాధించారు. బంగారం పార్శిల్‌ చేసిన కొరియర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల మూడో తేదీన తెల్లవారుజామున ఆరున్నర కోట్లకుపైగా విలువైన బంగారం పార్శిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

6 crore worth gold seized at shamshabad airport in rangareddy district
బంగారం పట్టివేత కేసులో విచారణ ముమ్మరం
author img

By

Published : Oct 5, 2020, 4:07 AM IST

అక్టోబర్​ మూడో తేదీన శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో ఎయిర్​ కార్గోలో అనుమానాస్పద పార్శిల్​ను అధికారులు గుర్తించారు. పార్శిల్​పై చిరునామా లేకపోవడం వల్ల కస్టమ్స్​ అధికారులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న కస్టమ్స్​ అధికారులు పార్శిల్​ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో ఆరున్నర కోట్లకుపైగా విలువైన బంగారాన్ని గుర్తించారు.

ఇప్పటి వరకు ఆ బంగారం తమదంటూ ఎవరూ ముందుకు రాలేదని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. పార్శిల్‌కు సంబంధించి చిరునామాలు కాని, పత్రాలు కాని ఏలాంటి లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న ఫోన్‌ నంబర్ల ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు దేశంలో 12 ఏజెన్సీలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో విదేశీ బిస్కెట్లతోపాటు స్వదేశీ బిస్కెట్లు, పెద్ద ఎత్తున ఆభరణాలు ఉండడం వల్ల తెరవెనుక ఎవరున్నారన్న కోణంలో విచారిస్తున్నారు.

ఎయిర్‌ కార్గో ద్వారా ముంబాయికి పార్శిల్‌ పంపేందుకు ప్రయత్నించిన కొరియర్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆరున్నర కోట్లుకుపైగా విలువైన బంగారం, వజ్రాలు, బంగారు ఆభరణాలకు చెందిన వ్యవహారమైనందున కొరియర్‌ చేసిన వారికి కచ్చితంగా వివరాలు తెలిసి ఉంటాయని కస్టమ్స్‌ అధికారులు భావిస్తున్నారు.

కొరియర్‌ ద్వారా హైదరాబాద్‌ నుంచి ఆ బంగారం పార్శిల్‌ను పంపింది ఎవరు.. వారికి ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది... ముంబయిలో ఎవరికి పంపుతున్నారు.. కాగితాలు లేకుండా రహస్యంగా పంపడానికి కారణాలు ఏమిటి తదితర విషయాలపై ఆరా తీయాల్సి ఉందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. కేసు మరింత లోతైన దర్యాప్తు చేయాల్సి ఉండటంతో ఎయిర్‌ పోర్టులో ఉన్న ఈ కేసును హైదరాబాద్‌ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: శంషాబాద్​ విమానాశ్రయంలో రూ.6.62 కోట్లు విలువైన బంగారం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.