ఐదు రాష్ట్రాలకు చెందిన 350 మంది అధికారుల పేరుతో సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కేంద్రంగా ఫేస్‌బుక్ నకిలీ ఖాతాలతో దందా సాగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు నల్గొండకు తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన 20 ఏళ్లలోపు ఉన్న ముస్తఖీమ్ ఖాన్, మనీశ్, షాహీద్, సద్దాం ఖాన్ ఓ ముఠాగా ఏర్పడ్డారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణ రాష్ట్రాల పోలీసు అధికారులతో పాటు బ్యాంకు, రైల్వే, సీఆర్‌పీఎఫ్ అధికారుల పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించారు. డబ్బులు పంపాలని రిక్వెస్టులు పెడుతూ మోసగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు పోలీసు ఉన్నతాధికారులపైనే ఎక్కువగా ఎందుకు దృష్టి సారించారు, వీరికి ఎవరు సహకరిస్తున్నారు, మోసగించి రాబట్టిన నగదు వారికి ఎలా చేరుతోంది? తదితర కోణాల్లో విచారిస్తున్నామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
ఇవీ చూడండి: తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని తోటి స్నేహితున్ని హతమార్చారు