ETV Bharat / jagte-raho

శంషాబాద్‌ విమానాశ్రయంలో 21 కిలోల బంగారం స్వాధీనం - శంషాబాద్‌ విమానాశ్రయం తాజా వార్తలు

21-kg-gold-seized-at-shamshabad-airport-hyderabad
శంషాబాద్‌ విమానాశ్రయంలో 21 కిలోల బంగారం పట్టివేత
author img

By

Published : Oct 3, 2020, 8:20 PM IST

Updated : Oct 3, 2020, 9:33 PM IST

20:19 October 03

శంషాబాద్‌ విమానాశ్రయంలో 21 కిలోల బంగారం స్వాధీనం

శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ముంబయికి తీసుకెళ్తున్న 21 కిలోల బంగారంతో కూడిన పార్సిల్‌ను స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఆఫ్‌ కస్టమ్స్‌ విభాగం స్వాధీనం చేసుకుంది. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన ఈ విభాగం ఎయిర్‌ కార్గో నుంచి పార్సిల్‌ను స్వాధీనం చేసుకుని తెరచి చూడగా బంగారు ఆభరణాలు, వజ్రాలు, బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. అందులో రెండు కిలోలు విదేశీ బంగారం కాగా.. వజ్రాలు, ఆభరణాలు, బంగారు బిస్కెట్లు కలిసి మరో 19 కిలోలు ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. 

అయితే పార్సిల్‌పై ఫోన్‌ నంబరు మినహా ఏ వివరాలు లేకపోవడం వల్ల ఆ పార్శల్‌ను ఎవరు పంపించారన్న దానిపై కస్టమ్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్‌ నంబర్​ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్‌ అధికారులు.. కార్గోలో ఈ పార్సిల్‌ను ఎవరు ముంబయికి పంపించారన్న వివరాలు రాబట్టేందుకు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్‌ ను పరిశీలిస్తున్నారు. 

సాధారణంగా ఎయిర్‌ కార్గో నుంచి ఏ పార్సిల్ పంపించినా వారి చిరునామా, ఫోన్‌ నంబర్​ తదితర వివరాలు ఉంటాయి. అదే విధంగా ఎక్కడికి వెళ్లాలో అక్కడకు సంబంధించిన వివరాలు ఫోన్‌ నంబరుతో సహా ఉంటాయి. కానీ ఆ పార్శల్లో అలాంటివేమి లేకపోవడం వల్ల అనుమానం వచ్చి కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఆప్‌ కస్టమ్స్‌ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్న పార్శల్‌పై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : 'ఓ వైపు క్యాబ్ డ్రైవర్​.. మరోవైపు దొంగతనాలు'

Last Updated : Oct 3, 2020, 9:33 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.