ETV Bharat / jagte-raho

సరైనపత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.15 లక్షలు స్వాధీనం - money seized by police

సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న డబ్బును హైదరాబాద్​ బంజారాహిల్స్​లో పోలీసులు పట్టుకున్నారు. అనుమానితుని నుంచి రూ.14.96 లక్షలు, ఓ ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నగదు హవాల డబ్బు కాదని పోలీసులు స్పష్టం చేశారు.

సరైనపత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.15 లక్షలు స్వాధీనం

author img

By

Published : Oct 30, 2020, 9:08 PM IST

సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదును హైదరాబాద్​ మధ్యమండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనుమానితుని నుంచి రూ.14.96 లక్షలు, ఓ ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్​కు చెందిన డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా చేగుంటలో ఇల్లు నిర్మాణాన్ని చేపట్టారు. వారం రోజులుగా అక్కడి పనివారికి డబ్బు ఇవ్వలేదు.

తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.14లక్షల 80 వేలు డ్రా చేసి బంజారాహిల్స్​ నుంచి హైదర్‌గూడా వైపు వెళ్తుండగా.. టాస్క్​ఫోర్క్​ పోలీసులు కారును అడ్డుకున్నారు. కారును తనిఖీ చేయగా... 14 లక్షల 96 వేలు దొరికాయి. డబ్బుకు సరైన పత్రాలు లేని కారణంగా శ్రవణ్​ కుమార్​‌ రెడ్డిని టాస్క్​ఫోర్స్ పోలీసులు నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత నగదును పోలీసులు ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు. దొరికిన నగదు హవాల డబ్బు కాదని పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా అరెస్ట్​... రూ.16 లక్షలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.