ETV Bharat / jagte-raho

హేమంత్​ హత్య కేసులో 13 మంది నిందితుల అరెస్టు

author img

By

Published : Sep 25, 2020, 1:03 PM IST

గచ్చిబౌలి పరువు హత్య కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జీ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి హేమంత్​కు ఉరేసి చంపినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు.

13 Accused arrested in hemanth murder case in hyderabad
హేమంత్​ హత్య కేసులో 13 మంది నిందితుల అరెస్టు

హైదరాబాద్ చందానగర్‌లో నివాసం ఉంటున్న హేమంత్‌ అదే ప్రాంతానికి చెందిన అవంతిని ఇంట్లో వారిని ఎదిరించి నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారు గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి ఇంటికి గురువారం మధ్యాహ్నం అవంతి తల్లిదండ్రులు వారి బంధువులు మూడు కార్లలో వచ్చారని మాదాపూర్ ఇంచార్జీ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. హేమంత్‌, అవంతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అవంతి తప్పించుకోగా.. హేమంత్​ను కారులో తీసుకెళ్లారని చెప్పారు.

హేమంత్​ తల్లిదండ్రులు చందానగర్​ పోలీసులకు సమాచామిచ్చారని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మిగతావారు హేమంత్​ను మరో కారులో తీసుకెళ్లారన్నారు. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డిని షామీర్​పేట్​లో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా సంగారెడ్డి దగ్గర హేమంత్​ను ఉరేసి హత్య చేసినట్లు ఒప్పకున్నాడని డీసీపీ వెల్లడించారు.

ఇదీ చదవండి: కుమార్తె ప్రేమ పెళ్లి.. పరువు కోసం అల్లుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.