ETV Bharat / jagte-raho

100 ఫోన్ కాల్ ఒకరి ప్రాణం కాపాడింది.

author img

By

Published : Dec 19, 2020, 5:28 PM IST

100 ఫోన్ కాల్ ఒకరి ప్రాణం కాపాడింది. క్షణికావేశంలో పురుగుల మందు తాగిన ఓ వ్యక్తిని పోలీస్ సిబ్బంది రక్షించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన వారిని పలువురు అభినందించారు.

100-phone-calls saved person life
100 ఫోన్ కాల్ ఒకరి ప్రాణం కాపాడింది.

క్షణికావేశంలో పురుగుల మందు తాగిన ఓ వ్యక్తిని.. పోలీస్​ సిబ్బంది తక్షణమే స్పందించి రక్షించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

భార్య, భర్తల మధ్య గొడవతో తిరుమలగిరికి చెందిన జీడిమెట్ల గణేష్ అనే వ్యక్తి క్షణికావేశంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే బాధితుని బంధువులు 100 నెంబర్‌కు ఫోన్​ చేశారు. కాల్​ అందుకున్న పోలీస్​ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందిని బాధితుని బంధువులు, ఎస్సై అభినందించారు.

ఇదీ చూడండి: బీజాపూర్ జాతీయ రహదారిపై వెళ్లాలంటే.. గుండె బేజారే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.