ETV Bharat / international

'పశ్చిమాసియాలో ఉగ్ర ముప్పును పెంచిన కరోనా' - పశ్చిమాసియాలో ఉగ్రవాదం

కొవిడ్​-19 కారణంగా పశ్చిమాసియాలో ఉగ్ర ముప్పు పెరిగిందని ఐక్యరాజ్యసమితి నిపుణులు తమ నివేదికలో వెల్లడించారు. అఫ్గానిస్థాన్​, సిరియా, ఇరాక్​లతో పోలిస్తే మాత్రం ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు తక్కువగా ఉందని తెలిపారు. కరోనా వల్ల పోలీస్ బలగాలు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను నెలకొల్పలేక పోవటమే ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించటానికి కారణమని వివరించారు.

UN experts: COVID-19 upped extremist threats in conflicts
'పశ్చిమాసియాలో ఉగ్ర ముప్పును పెంచిన కరోనా'
author img

By

Published : Feb 6, 2021, 6:23 AM IST

కరోనా కారణంగా పశ్చిమాసియాలోని పలు దేశాల్లో ఉగ్రముప్పు పెరిగిందని ఐక్యరాజ్యసమితి నిపుణులు తెలిపారు. ఈ మేరకు తమ రిపోర్టును ప్యానెల్ అధికారులకు అందించారు. అఫ్గానిస్థాన్​, సిరియా, ఇరాక్​ ప్రాంతాల్లో 2020 ద్వితీయార్థంలో ఉగ్రముప్పు అనూహ్యంగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ దేశాల్లోని చాలా ప్రాంతాల్లో కరోనా నిబంధనలు సడలించిన నేపథ్యంలో దాడులు జరగవచ్చని హెచ్చరించారు.

ఇరాక్​, సిరియాలు ఇస్లామిక్ సంస్థకు ముఖ్యమైన ప్రాంతాలను ప్యానెల్ అభిప్రాయపడింది. అయితే అఫ్గానిస్థాన్​పై మాత్రం టెర్రరిస్టులు తీవ్ర ప్రభావం చూపారని నిపుణులు తెలిపారు. గతేడాది ఫిబ్రవరి 29 నుంచి ఇప్పటివరకు దాదాపు 600పైగా అఫ్గాన్​ పౌరులు, 2500 మంది భద్రతా బలగాలను ఉగ్రవాదులు హతమార్చారని వివరించారు. అఫ్గాన్​లో శాంతి చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు.

దాదాపు 10వేల మంది ఉగ్రవాదులు ఇరాక్, సిరియాలో ఉన్నట్లు ప్యానెల్ అంచనా వేసింది. ఉగ్రవాదులు... తమ కార్యకలాపాలను వెస్ట్ ఆఫ్రికాకు సైతం విస్తరించారని పేర్కొంది.

ఇదీ చదవండి : తాలిబన్ల దాడిలో 26 మంది భద్రతా సిబ్బంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.