ఆస్ట్రేలియాలోని అద్భుతమైన పగడాల దీవిలో క్వీన్స్‌ల్యాండ్ పర్యటక శాఖతో కలిసి సంయుక్తంగా "ఎస్సీ ఉబర్" పేరిట.. జలాంతర్గామి సేవలను ప్రవేశపెట్టింది. ఈ జలాంతర్గామిలో ప్రయాణించే వారు సముద్ర లోపల 180 డిగ్రీలతో అందాలను వీక్షించొచ్చు. ఎలాంటి మాస్క్ ధరించకుండానే సుమారు 30 మీటర్ల లోతువరకు చేరుకోవచ్చు.
ధర ఇదే..
ఉబర్ యాప్ ద్వారా ఈ సబ్‌మెరైన్ సేవలను పొందవచ్చు. ఇందు కోసం ఇద్దరు ప్రయాణికులు 3 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.
27న ప్రారంభం
క్వీన్స్‌ల్యాండ్ గోల్డ్‌స్టోన్ తీరంలోని హెరోన్ ద్వీపంలో రేపు(మే 27న) ఈ సేవలను ప్రారంభించనుంది ఉబర్ సంస్థ. జూన్ 18 వరకు ఉత్తర క్వీన్స్లాండ్ పోర్ట్ డగ్లస్లోని అగిన్కోర్ట్ పగడాల దీవిలో ఈ సేవలను అందించాలని ప్రణాళిక వేసుకుంది.
ఇదీ చూడండి: కారుపై 'పేడ కోటింగ్'... చల్లటి ఐడియా గురూ!