ETV Bharat / international

లాక్​డౌన్​లోనూ అక్కడ భారీ స్థాయిలో ఆందోళనలు - ఇజ్రాయెల్​లో కఠిన లాక్​డౌన్​

కరోనా లాక్​డౌన్​ నిబంధనలను లెక్కచేయకుండా.. ఇజ్రాయెల్​లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహు.. ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

Thousands of Israelis protest in Jerusalem, despite lockdown
లాక్​డౌన్​లోనూ అక్కడ భారీ స్థాయిలో ఆందోళనలు
author img

By

Published : Sep 27, 2020, 5:16 AM IST

ఇజ్రాయెల్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి. ప్రధాని నెతన్యాహు అధికార నివాసాన్ని చుట్టుముట్టిన వేలాది మంది నిరసనకారులు.. ఆయన రాజీనామాకు డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రువారం నుంచి దేశవ్యాప్తంగా కఠినమైన లాక్​డౌన్​ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అనేక వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని అదేశాలిచ్చింది అక్కడి ప్రభుత్వం. అయినప్పటికీ ఈ నిరసనల్లో వేలాది మంది పాల్గొనడం అధికారులను కలవరపెట్టింది.

అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి నెతన్యాహు వైదొలగాలని ఆందోళనకారులు గత కొన్ని నెలలుగా డిమాండ్​ చేస్తున్నారు. కరోన సంక్షోభంలో ప్రధాని నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. నిరసనకారుల్లో చాలా మంది యువత, విద్యావంతులే ఉండటం గమనార్హం. వీరిలో చాలా మంది కరోనా లాక్​డౌన్​లో ఉద్యోగాలు కోల్పోయారు.

అయితే నిరసనలను అణచివేసేందుకు గత కొంత కాలం నుంచి నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు. ప్రజా ఆరోగ్యానికి ఈ నిరసనలు హాని కలిగిస్తాయని, వీటిని నిషేధించాలని ఓ బిల్లును ఆ దేశ పార్లమెంట్​లో ప్రవేశపెట్టారు నెతన్యాహు. కానీ దానికి అమోదం లభించడం లేదు. కరోనా సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని.. నిరసనలకు చెక్​ పెట్టేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదీ చూడండి:- ఇజ్రాయెల్​పై​ బహిష్కరణ ఎత్తివేసిన యూఏఈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.