ETV Bharat / international

ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల ప్రయాణం నిషేధం!

కరోనా నేపథ్యంలో సౌదీ తమ పౌరులపై ఆంక్షలను అమలు చేస్తోంది. రెడ్​ లిస్ట్​లో ఉన్న దేశాలకు వెళ్లిన వారికి మూడేళ్ల పాటు ప్రయాణాలు నిషేధించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

author img

By

Published : Jul 29, 2021, 3:51 AM IST

saudi arabia travel ban
ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల ప్రయాణం నిషేధం!

కొవిడ్​ తీవ్రత అధికంగా ఉండి రెడ్​ లిస్ట్​లో ఉన్న దేశాలకు వెళ్లిన తమ పౌరులకు మూడేళ్ల పాటు ప్రయాణాలు నిషేధిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో భారత్​ కూడా ఉంది. ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రయాణ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తామని.. అదే విధంగా మూడేళ్ల పాటు వారు విదేశాలు వెళ్లకుండా నిషేధానికి గురవుతారని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక పత్రిక సౌదీ ప్రెస్​ ఏజెన్సీ (ఎస్​పీఏ) వెల్లడించింది.

రెడ్​ లిస్ట్​లో యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్​, యెమెన్​, ఇరాన్​, టర్కీ, ఆర్మేనియా, ఇథియోపియా, సోమాలియా, కాంగో, అఫ్గానిస్థాన్, వెనెజవెలా, బెలారస్​, వియత్నాం, భారత్​ తదితర దేశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి : 'వారం రోజుల్లోనే 21% పెరిగిన కరోనా మరణాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.