ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల వైరంతో పాలస్తీనాలోని గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. లెబనాన్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పైకి రాకెట్ దాడులు జరపడం కలకలం రేపుతోంది. ఉత్తర ఇజ్రాయెల్‌పై లెబనాన్ నుంచి రాకెట్ దాడులు జరిగాయి. అయితే.. దీని వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ఈ దాడికి తామే కారణం అని ఎవరూ ప్రకటించకపోవడం గమనార్హం.
మరోవైపు హమాస్ ఉగ్రవాదులతో పోరాటం ఆపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు సూచించారు. ఈ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతిని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణకు దారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
బైడెన్ సూచనలను నెతన్యాహు బేఖాతరు చేశారు. గాజాపై సైనిక దాడి విషయంలో ముందుకే వెళతామని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: