ETV Bharat / international

'పెగాసస్​' అసలు గుట్టు తేల్చే పనిలో ఇజ్రాయెల్! - ఇజ్రాయెల్​ స్పైవేర్​

పెగాసస్​.. ఇప్పుడు భారత్​తో పాటు పలు దేశాల్లో సంచలనంగా మారిన అంశం. ఈ స్పైవేర్​ను దుర్వినియోగం చేస్తూ కీలక నేతలు, ప్రముఖులపై నిఘా పెట్టారన్న మీడియా కథనాలతో దుమారం చెలరేగింది. ఈ క్రమంలో పెగాసస్​ దుర్వినియోగం, లైసెన్స్​ల జారీపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్​.

Pegasus
పెగాసస్​ స్పైవేర్​ దుమారం
author img

By

Published : Jul 23, 2021, 3:39 PM IST

పెగాసస్​ స్పైవేర్​ గూఢచర్యం వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న క్రమంలో ఇజ్రాయెల్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్​ఎస్​ఓ గ్రూప్​ నిఘా సాఫ్ట్​వేర్​ దుర్వినియోగంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. లైసెన్సుల జారీ విషయంపై పూర్తిస్థాయిలో సమీక్షించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది.

రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు సహా కీలక వ్యక్తులే లక్ష్యంగా పెగాసస్​ స్పైవేర్​ను వినియోగించారని పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ క్రమంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆర్మీ రేడియోకు తెలిపారు శాసనసభ్యుడు, విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిటీ చీఫ్​ రామ్​ బెన్​ బరాక్​.

'ఈ సాఫ్ట్​వేర్​ను ఇజ్రాయెల్​కు చెందిన ఎన్​ఎస్​ఓ.. ఉగ్రవాదం, అక్రమాలను అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలకు విక్రయించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కన్సార్టియం తెలిపింది. పెగాసస్​ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి కాగానే.. వివరాలను తీసుకుని, ఏదైనా సవరణలు అవసరమా? అనేదానిపై నిర్ణయానికి వస్తాం. ఈ విషయంలో సమీక్షించటం వెనక లైసెన్స్​ల జారీనే ఇజ్రాయెల్​ ప్రాధాన్యం. చాలా ఉగ్రవాద సంస్థలను గుర్తించేందుకు పెగాసస్ ఉపయోగపడింది. అయితే.. దుర్వినియోగం కావటం, బాధ్యతారహిత వ్యవస్థలకు విక్రయించటం అనే విషయాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది."

- రామ్​ బెన్​ బరాక్, శాసనసభ్యుడు,​ విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిటీ చీఫ్​

స్వాగతించిన ఎన్​ఎస్​ఓ చీఫ్​..

ఇజ్రాయెల్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు ఎన్​ఎస్​ఓ సంస్థ చీఫ్​ షేలెవ్​ హులియో. దర్యాప్తు చేపడితే తాము చాలా సంతోషిస్తామని, దాని ద్వారా తమపై వచ్చిన మచ్చను తొలగించుకుంటామన్నారు. ప్రస్తుత ఆరోపణలు.. మొత్తం ఇజ్రాయెల్​ సైబర్​ ఇండస్ట్రీపైనే మచ్చ తెచ్చే ప్రయత్నమని ఆందోళన వ్యక్తం చేశారు. గోపత్య కారణంగా.. స్పైవేర్​ కాంట్రాక్టులను బయటపెట్టలేమని, అయితే.. ఏదైన ప్రభుత్వం పూర్తి వివరాల కోసం కోరితే సహకరిస్తామని హామీ ఇచ్చారు.

పాకిస్థాన్​ ఆందోళన..

ఇజ్రాయెల్​ స్పైవేర్​ పెగాసస్​ను ఉపయోగించి ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ సహా పలువురు విదేశీయులపై భారత్​ నిఘా వేసిందన్న వార్తలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది పాకిస్థాన్​. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఐక్యరాజ్య సమితిని కోరినట్లు తెలిపింది. 'అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారత్‌ తన ప్రయోజనాల కోసం విస్తృతమైన గూఢచర్యానికి పాల్పడుతోంది. పెగాసస్ పర్యవసనాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. భారత్‌ చర్యలను అంతర్జాతీయ సమాజం ముందుకు తీసుకొస్తాం. వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి' అని పాకిస్థాన్​ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటన చేసింది.

ఇదీ చూడండి: పెగాసస్​ డేటా లీక్​పై ఫ్రాన్స్ దర్యాప్తు!

కేంద్ర మంత్రులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.