ఇరాక్‌లో అమెరికా వైమానిక దాడులు రెండోరోజూ కొనసాగాయి. ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ కమాండర్ హషీద్ అల్ షాబి వాహన శ్రేణి లక్ష్యంగా ఉత్తర ఇరాక్‌లో అగ్రరాజ్యం రాకెట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు ఇరాక్ సైన్యం ప్రకటించింది.
ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమాని అంత్యక్రియల నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిపై రాకెట్లతో దాడి చేసినట్లు ఇరాక్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో రెండు కార్లు మంటల్లో కాలిపోయాయి. దాడిలో మరణించిన ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉందని ఇరాక్ సైన్యం పేర్కొంది.
ఇదీ చూడండి: ట్రంప్‌కే నేరుగా హెచ్చరికలు.. అసలు ఎవరీ సులేమానీ?