ETV Bharat / international

విల్లాయే జైలు.. యువరాణి బందీ! - యూఏఈ ప్రధాని

యూఏఈ ప్రధాని మక్తోమ్​ కుమార్తె, దుబాయ్​ యువరాణి లతీఫా గత రెండేళ్లగా ఆమె నివాసంలో బందీగా ఉంటోంది. బీబీసీ పరిశోధనాత్మక కథనాల్లో భాగంగా మంగళవారం విడుదల చేసిన ఓ వీడియో ద్వారా ఆమె పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాలపై యూఏఈతో చర్చిస్తామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

dubai, princess
విల్లాయే జైలు.. యువరాణి బందీ!
author img

By

Published : Feb 18, 2021, 8:47 AM IST

ఆమె ఓ రాకుమారి.. పెద్ద విల్లాలో జీవనం. నాణేనికి ఇది ఓవైపు చిత్రం. మరోవైపు ఆ విల్లాయే ఆమెకు జైలు. అందులో ఆమె బందీ. బాహ్య ప్రపంచపు స్వేచ్ఛా వాయువులకు బహుదూరంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. అసలు తాను ఎప్పటికైనా బయటపడగలనా? అని అంతులేని ఆవేదనలో ఉంది. ఇది దుబాయ్​ యువరాణి 'వ్యథార్థ' గాథ. ఆమె.. రాచరికపు పాలనలోని యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ (యూఏఈ) ప్రధాని, ఉపాధ్యక్షుడు, శక్తిమంతమైన నేత షేక్ మహమ్మద్​ బిన్ రషీద్​ ఆల్​ మక్తోమ్​ కుమార్తె లతీఫా. బీబీసీ పరిశోధనాత్మక కథనాల్లో భాగంగా మంగళవారం విడుదల చేసిన ఓ వీడియో ద్వారా ఆమె పరిస్థితి వెలుగులోకి వచ్చింది.

నేను ఓ బందీని. ఈ విల్లాను జైలులా మార్చేశారు. కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చేందుకు కూడా నేను బయటకు వెళ్లలేను. నేను ఎప్పుడు విడుదల అవుతానో.. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలీదు.

-లతీఫా, దుబాయ్​ యువరాణి

ఈ వీడియోలను నెలల తరబడి ఆమె రహస్యంగా ఫోన్​లో తీసి పంపించినట్లు బీబీసీ వెల్లడించింది. అయితే ఇవి కూడా 6 నెలలు క్రితం నాటివని, ఆ తర్వాత వీడియోలు రావడం ఆగిపోయినట్లు ఆమె సమీప బంధువు, బ్రిటన్​లో ఉంటున్న మార్కస్​ ఎసాబ్రీ బీబీసీకి తెలిపారు. కాగా తాజా పరిణామాలపై యూఏఈలతో చర్చిస్తామని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తెలిపింది. ఈ విషయమై ఐరాసకు తాము మద్దతిస్తామని బ్రిటీష్ విదేశాంగ శాఖ మంత్రి డొమినిక్​ రాబ్​ తెలిపారు. తన కుటుంబ సంరక్షణలో లతీఫ్ సురక్షితంగానే ఉన్నట్లు షేక్​ మహమ్మద్​ వెల్లడించారు.

బందీ వెనుక కథ..

ఆమె బందీగా ఉండటం వెనుక ఓ కథ ఉంది. మితిమీరిన నిబంధనలు, నిర్బంధాలతో విసిగిపోయిన ఆమె 2018లో మాజీ ఫ్రెంచి గూఢచారి సాయంతో దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఓ పడవ ఎక్కారు. ఇది తెలుసుకున్న కమాండోలు ఆమె పడవను చుట్టుముట్టి వెనక్కి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన సమాచారమేదీ బయటకు రాలేదు.

ఇదీ చదవండి : అమెరికాపై 'హిమ ఖడ్గం'- 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.