ETV Bharat / international

'గాజాపై మరిన్ని రాకెట్లతో విరుచుకుపడతాం' - ఇజ్రాయెల్​ దాడులు

హమాస్​ ఉగ్రవాదులు చేస్తోన్న రాకెట్​ దాడులకు బదులుగానే తమ దేశం వైమానిక దాడులు చేసిందని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు తెలిపారు. వారం రోజులుగా పాలస్తీనా మిలిటెంట్లు తమపై క్షిపణుల వర్షం కురిపించారని పేర్కొన్నారు. దాడులతో మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు.

Netanyahu
'ఉగ్ర చర్యలకు ప్రతిస్పందనగానే దాడి చేశాం'
author img

By

Published : May 16, 2021, 8:28 AM IST

పాలస్తీనా ఉగ్రవాదులు చేసిన రాకెట్​ దాడులకు ప్రతిస్పందనగానే తమ దేశం వైమానిక దాడులు చేస్తోందని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు తెలిపారు. మరింత శక్తివంతంగా విరుచుకుపడతామని హెచ్చరించారు. వారం రోజులుగా పాలస్తీనా మిలిటెంట్లు తమపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నారని.. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని వివరించారు. ఇటువంటి చర్యలను ఏ దేశమూ సహించబోదని స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దాడులకు స్పందిస్తున్నామని పేర్కొన్నారు.

గాజాలోని అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో స్థావరాల్లు ఏర్పరచుకుని హమాస్​ ఉగ్రవాదులు రాకెట్​ దాడులకు పాల్పడుతున్నట్లు నెతన్యాహు ఆరోపించారు. ఇజ్రాయెల్​ ఓ సీనియర్ హమాస్​ కమాండర్​ ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ దాడికి కారణం...

గాజాలో అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అసోసియేట్‌ ప్రెస్‌తో పాటు అల్‌ జజీరాలు ఉండే భవనంపై ఇజ్రాయెల్‌ బలగాలు క్షిపణి దాడి చేశాయి. దీంతో ఆ భవనం కూలిపోయింది. వార్త సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం పట్ల వివరణ ఇవ్వాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని సంబంధిత సంస్థలు డిమాండ్ చేశాయి. దీనిపై అసోసియేట్​ ప్రెస్​ సీఈఓ గ్యారీ ప్రూట్​ స్పందించారు. గాజాలో ఏం జరుగుతోంది అనేది ప్రపంచానికి ఇప్పడు చాలా తక్కువ తెలుస్తోందని అన్నారు.

ఈ వ్యవహారంపై నెతన్యాహు స్పందించారు. ఈ వైమానిక దాడిలో ప్రాణ నష్టం జరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సైనిక ప్రయోజనాల కోసం హమాస్ ఈ భవనాన్ని ఉపయోగించినట్లు, అందుకే దాడి చేసినట్టు వివరించారు.

'ఫ్రీ పాలస్తీనా'

దాడులతో విలవిలలాడుతున్న గాజా, పాలస్తీనాకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ చేస్తోన్న వైమానిక దాడులకు స్వస్తి చెప్పాలని లాస్ ఏంజిల్స్, బోస్టన్, ఫిలడెల్ఫియాలతో పాటు అమెరికాలోని ఇతర నగరాల్లో ఉండే పాలస్తీనా మద్దుతుదారులు నిరసనలకు దిగారు. లాస్​ ఏంజిల్స్​లోని ఫెడరల్ బిల్డింగ్​ నుంచి ఇజ్రాయెల్​ కాన్సులేట్​ వరకూ రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ను అడ్డుకున్నారు. 'ఫ్రీ పాలస్తీనా' అనే నినాదాలతో హోరెత్తించారు.

ఇదీ చూడండి: ఇజ్రాయెల్​కు బైడెన్​ మద్దతు.. గాజాలో మరణాలపై ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.